అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం అ.భా.ఆ.ఉ. సంఘం రిజి. 965 / 2019 ENGLISH
EducateAgitateOrganise

అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం

బహుజన భావజాలంతో స్థాపించబడిన మొట్టమొదటి ఆదివాసీ సంఘం

సమస్యలు లేని ఆదివాసీల భవిష్యత్తే మా లక్ష్యం. కృతజ్ఞత – బాధ్యత, సంక్షేమం – అభివృద్ధి, ఉన్నత లక్ష్యాల సాధనే మా ధ్యేయం.

రిజిస్ట్రేషన్ 965 / 2019
పిడికిలి బిగించిన చెయ్యి — జై భీమ్
సమస్యలు లేని ఆదివాసీల భవిష్యత్తే మా లక్ష్యం
కృతజ్ఞత – బాధ్యత, సంక్షేమం – అభివృద్ధి, ఉన్నత లక్ష్యాల సాధనే మా ధ్యేయం
మా ప్రతి సెలవు దినం, మా జ్ఞానం జాతి కోసం అంకితం. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసేవారే మా నాయకులు — వారే మా ప్రాధాన్యత.
సంఘాన్ని మా మనుగడగా, మా పసిబిడ్డగా, మా కుటుంబంగా భావించి మేము పనిచేస్తున్నాము. పదవుల్లో ఉన్న నాయకులందరూ అదే విధంగా భావించి పని చేయాలని మా విజ్ఞప్తి.
నేను సైతం నా కోసం… నా జాతి కోసం… కనీసం నెలలో నాలుగు గంటలు నాతోటి జాతి ప్రజలతో కలిసి మాట్లాడతా…
9,000+2020లో సాయం అందిన కుటుంబాలు
123సేవా కార్యక్రమాలు
105ఆన్‌లైన్ సమావేశాలు
43నాయకుల శిక్షణా తరగతులు
217 భాగాలలో లక్ష్యాలు
100%ఆదివాసీ అక్షరాస్యత — మా లక్ష్యం

సంఘం గురించి

రిజర్వేషన్లు మాత్రమే పని పూర్తి చేయలేదని గ్రహించి పుట్టిన సంఘం

స్వతంత్ర భారతావనిలో ఏడు దశాబ్దాలకు పైగా రిజర్వేషన్లు అమలులో ఉన్నప్పటికీ, ఎస్టీల (ఆదివాసీల) అక్షరాస్యత ఇప్పటికీ 50 శాతం కూడా దాటలేదన్న వాస్తవాన్ని గ్రహించిన తరువాత — జాతీయస్థాయిలో బహుజన సిద్ధాంత భావజాలంతో స్థాపించబడిన మొట్టమొదటి ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఇదే (రిజి. 965/2019).

రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్న అధికారులు, ఉద్యోగులే ఈ సంఘం పునాది. ఆ ఫలాలను అందించిన సమాజానికి తిరిగి రుణం తీర్చుకోవాలన్నదే సంఘం మౌలిక సిద్ధాంతం. "Pay Back to Your Society" అంటూ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపును నిత్య కార్యాచరణలోకి తీసుకురావడమే మా పని.

దేశంలోని అన్ని రాష్ట్రాలు – కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా – అసెంబ్లీ నియోజకవర్గ – మండల కమిటీలతో పాటు NRI (విదేశీ) కమిటీ ద్వారా సంఘం పనిచేస్తోంది.

మా లక్ష్యం

సమస్యలు లేని ఆదివాసీల భవిష్యత్తు — ఉద్యోగాలకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో నాయకత్వం.

మా ధ్యేయం

కృతజ్ఞత – బాధ్యత; సంక్షేమం – అభివృద్ధి; అంబేద్కర్ నిర్దేశించిన అత్యున్నత లక్ష్యాల సాధన.

మా చిహ్నం

పిడికిలి బిగించి పైకెత్తిన చెయ్యి — జై భీమ్. బోధించు, పోరాడు, సమీకరించు అన్నదే దాని వెనుక కార్యాచరణ.

స్ఫూర్తి ప్రదాతల మార్గం

మేము అనుసరిస్తున్న బహుజన పితామహులు – మాతామహులు

గౌతమ బుద్ధుడు
గౌతమ బుద్ధుడు
సంత్ కబీర్ దాస్
సంత్ కబీర్ దాస్
బిర్సా ముండా
బిర్సా ముండా
ఫూలే దంపతులు
ఫూలే దంపతులు
డా. బి.ఆర్. అంబేద్కర్
డా. బి.ఆర్. అంబేద్కర్
కొమరం భీమ్
కొమరం భీమ్
సాహూ మహారాజ్
సాహూ మహారాజ్
పెరియార్ రామస్వామి
పెరియార్ రామస్వామి
ఫాతిమా షేక్
ఫాతిమా షేక్
నారాయణ గురు
నారాయణ గురు

జాతీయ అధ్యక్షుల సందేశం

డా. దేవరకొండ వెంకటేశ్వర్లు

డా. దేవరకొండ వెంకటేశ్వర్లు

సంఘం అపెక్స్ బాడీ చీఫ్ కో-ఆర్డినేటర్ & జాతీయ అధ్యక్షులు · డిప్యూటీ ఇంజనీర్, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం · గౌరవ డాక్టరేట్, ఫిబ్రవరి 2021

మీకు మా హృదయపూర్వక జై భీమ్‌లు. ఏడు దశాబ్దాలకు పైగా రిజర్వేషన్లు అమలులో ఉన్న భారతావనిలో ఇప్పటికీ ఆదివాసీల అక్షరాస్యత 50 శాతం కూడా దాటలేదన్న వాస్తవాన్ని గ్రహించిన తరువాతే ఈ సంఘం ఏర్పడింది.

అభివృద్ధి సూచికల ప్రకారం భారతీయ ఆదివాసీ జనాభాలో కనీసం పదవ వంతు ప్రజానీకం కూడా సామాజికంగా సంతృప్తిగా లేరన్నది కఠోర వాస్తవం. ఈ రుగ్మతలను పారద్రోలడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వాటి సిద్ధాంత–భావజాలాలకు అనుగుణంగా వాటి పరిధుల్లో కృషి చేస్తూనే ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్న లబ్ధిదారుల్లో అధిక శాతం మంది సామాజిక కృతజ్ఞతను – బాధ్యతను విస్మరించారన్నది అర్థమవుతోంది. ఈ సత్యాన్నే బాబా సాహెబ్ అంబేద్కర్ తాను పరినిర్వాణం చెందే కొన్ని నెలల ముందు ఢిల్లీ సభలోను, ఆగ్రా సభలోను తేటతెల్లం చేస్తూ "Pay Back to Your Society" అని నినదించారు.

కానీ అతి కొద్ది స్థాయిలో మాత్రమే ఈ నినాదం ఆచరణలోకి వచ్చింది. ఈ నినాదాన్ని పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి తెచ్చి, తొలిగా ఎస్టీలలో అక్షరాస్యతను 100 శాతానికి చేర్చాలన్న మౌలిక లక్ష్యంతో ఈ సంఘం స్థాపించబడింది. అందుకోసమే "ఆదివాసీ ఆవాసాల చైతన్య యాత్ర"ను, "సంపూర్ణ ఆదివాసీ అక్షర ఉద్యమాన్ని" సంఘం ప్రారంభించింది.

రాబోయే 10 ఏళ్ళలో 18 సంవత్సరాలలోపు వయస్సున్న ప్రతి ఆదివాసీ బిడ్డను విద్యావంతులను చేయడానికి వివిధ రూపాలలో ఈ సంఘం కృషి చేసి నిశ్చితంగా సఫలీకృతమై, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందనడంలో మాకు ఎటువంటి సంశయము లేదు. సామాజిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర–సాంకేతిక, సాంస్కృతిక, న్యాయ, మీడియా, క్రీడా తదితర రంగాలలో ఈ సంఘం పని చేస్తుంది. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

డా. దేవరకొండ వెంకటేశ్వర్లు జాతీయ అధ్యక్షులు, అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం

7 భాగాలతో 21 సంఘ లక్ష్యాలు

సంఘ లక్ష్యాలు

సంఘ రాజ్యాంగంలో, డైరీలో ఉన్న క్రమంలోనే ఈ 21 లక్ష్యాలు ఇవ్వబడ్డాయి. ఏ భాగాన్నైనా తెరిచి చదవండి.

  1. 02

    అత్యంత వెనుకబడిన జాతుల సంపూర్ణ అభివృద్ధితోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందనే సమర్థ పాలకుల సందేశాన్ని ఆచరించుట.

  2. 03

    కేవలం విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో పాక్షికంగా పరిమితమైన ఆదివాసీలను వాటితో పాటు సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్య, వైజ్ఞానిక, వ్యవసాయ, ఆర్థిక, వ్యాపార–వాణిజ్య, పారిశ్రామిక, పాత్రికేయ, పాలన తదితర రంగాలన్నింటిలో ఉన్నతులుగా నిలబెట్టడంకోసం కృషి.

  3. 04

    సకల రంగాలలో అత్యంత వెనుకబడిన ఆదివాసీలను సమాజాన్నంతటికీ నాయకత్వం వహించేటట్లుగా సిద్ధం చేయుట (సమర్థవంతమైన నాయకులను తయారు చేసే కర్మాగారంగా సంఘం పని చేస్తుంది).

  1. 05

    ప్రపంచ మేధావి భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్‌చే రచించబడిన భారత రాజ్యాంగాన్ని సమూలంగా పరిరక్షించుట.

  2. 06

    రాజ్యాంగం ద్వారా సంక్రమించబడిన రిజర్వేషన్స్, అట్రాసిటీ యాక్ట్‌తో పాటు వివిధ రూపాలలో ఉన్న హక్కులను, అవకాశాలన్నింటిని పరిరక్షించుట.

  3. 07

    రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే పదానికి బదులుగా రిప్రజంటేషన్ అనే పదాన్ని చేర్పించేందుకు బాటలు వేయడంతో పాటు మారుతున్న సమకాలీన పరిస్థితులను బట్టి అన్ని రకాల నూతన హక్కుల కోసం, అవకాశాలకోసం కృషి.

  1. 08

    73 సంవత్సరాల రిజర్వేషన్ చరిత్రలో నేటికి కూడా 50 శాతం దాటని దేశవ్యాప్త ఆదివాసీల అక్షరాస్యతా శాతాన్ని 100 శాతానికి చేర్చుటకు కృషి. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఘం "సంపూర్ణ ఆదివాసీ అక్షర ఉద్యమాన్ని" ప్రారంభించింది. దీనిని దేశమంతటా విస్తృత పరచడానికి కృషి.

  2. 09

    యువతీ–యువకుల దేశీయ ఉన్నత విద్యతో పాటు విదేశీ విద్య కొరకు ఇప్పటికే ప్రారంభించబడిన అవగాహనా తరగతులను దేశమంతటా వ్యాప్తి చేయుట.

  3. 10

    ఆదివాసీలతో పాటు అన్ని కేటగిరీల నిరుద్యోగ యువతీ–యువకులకు గ్రూప్-4 నుంచి సివిల్ సర్వీసెస్ వరకు ఆన్‌లైన్ (Zoom) ద్వారా ప్రతిరోజు ఉచిత తరగతులను ఏడాదిగా నిర్వహిస్తున్నాము. ఇది నిరంతరం కొనసాగించుటకు కృషి (దీని వలన కొన్ని స్థాయిల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ అవుతాయి).

  4. 11

    అన్ని ప్రభుత్వ శాఖల్లో అన్ని స్థాయిల ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలను ప్రభుత్వాలచే భర్తీ చేయించుటకు కృషి.

  5. 12

    ప్రమోషన్స్‌లో రిజర్వేషన్స్ అనే ప్రక్రియకు అడ్డంకిగా ఉన్న అడెక్వసీ (Adequacy) అనే పదం ఉన్న జి.ఓ.లను రద్దు చేయించుటకు లేక సవరించుటకు కృషి (ఇప్పటికీ ఆమోదం పొందని 117 రాజ్యాంగ సవరణ బిల్లులోని అంశాలను పరిశీలించవలసినదిగా మనవి).

  6. 13

    ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్స్ సాధనకు కృషి.

  1. 14

    రాజ్యాంగం ద్వారా సంక్రమించబడిన మరియు వివిధ ప్రభుత్వాలచే రూపొందించబడిన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలపై ఆదివాసీలకు అవగాహన కలిగించుట.

  1. 15

    వేలాది సంవత్సరాలుగా సామాజిక రుగ్మతలైన వర్ణ వ్యవస్థ–కుల వ్యవస్థ వలన ఛిద్రమైన బహుజనుల బ్రతుకులను బాగు చేసిన బహుజన పితామహుల–మాతామహులతో పాటు మన ముందు తరాలకు చెందిన నాయకుల యొక్క వాస్తవికమైన జీవిత చరిత్రలను వెలుగులోకి తెచ్చుటకు కృషి.

  2. 16

    బహుజన పితామహుల–మాతామహుల స్ఫూర్తిని, చైతన్యాన్ని సర్వసాధారణ ప్రజలకు సైతం చేర్చుటకు అవకాశం ఉన్నంత వరకు సంఘ సమావేశాలను ఆదివాసీ కాలనీల్లో – ఆవాసాల్లోనే నిర్వహిస్తున్నాము. సమావేశాల ప్రారంభానికి ముందు ఆయా ఆవాసాల్లో – కాలనీల్లో ఇంటింటి పలకరింపు యాత్రని నిర్వహిస్తున్నాము. వాటిని కొనసాగించేందుకు కృషి.

  3. 17

    డా. బి.ఆర్. అంబేద్కర్ యొక్క బోధించు, పోరాడు, సమీకరించు అనే నినాదాలతోపాటు "Pay Back to Your Society" అనే సందేశాన్ని మరియు వారు నిర్దేశించిన అత్యున్నత లక్ష్యాల సాధనకు కృషి.

  1. 18

    NRI (విదేశీ) కమిటీతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల – కేంద్ర పాలిత ప్రాంతాల కమిటీలను, జిల్లా – అసెంబ్లీ నియోజకవర్గాల – మండలాల కమిటీలను మరింత బలోపేతం చేయుటకు కృషి.

  2. 19

    వందేళ్ళకు పైబడిన సువర్ణ చరిత్రను సంఘానికి సృష్టించడం కోసం "సంఘ పునాదుల నిర్మాణం" అనే కార్యక్రమంలో భాగస్వాములవుతున్న నాయకులకు మరియు వారి కుటుంబాలకు వివిధ రకాలుగా సంఘం నిత్యం అండగా ఉండడమే కాకుండా, సంఘం యొక్క వందో వార్షికోత్సవంలో (2119 సం॥) వారిని గాని, వారి వారసులను గాని అత్యున్నత పురస్కారంతో సత్కరించే విధంగా సంఘాన్ని తయారు చేస్తుంటాం.

  3. 20

    ఆదివాసీల అన్నిరకాల సమంజసమైన ఆలోచనలను, అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొని సంఘ శ్రేయస్సే లక్ష్యంగా వాటి ఆచరణకు కృషి.

  1. 21

    భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో రూపొందించబడిన సంఘం యొక్క రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేసేందుకు కృషి.

సంఘం సాధించిన విజయాల్లో కొన్ని

సంఘం ఇప్పటికే సాధించిన 21 విజయాలు

01

కరోనా మహమ్మారి వలన 2020లో పోషణార్థం ఇబ్బందులు పడుతున్న ఎస్టీలతో పాటు వివిధ వర్గాల్లో పేదరికంలో ఉన్న సుమారు 9 వేల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఖర్చుతో 123 సేవా కార్యక్రమాల ద్వారా బియ్యం, వంట సరుకులు, కూరగాయలు వగైరా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.

02

మొత్తం 105 జూమ్/ఆన్‌లైన్ సమావేశాల ద్వారా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల ఏర్పాటుతో పాటు బహుజన సిద్ధాంత భావజాలాల వ్యాప్తి కొరకు శిక్షణా తరగతులు నిర్వహించడమైనది.

03

వాలంటీర్స్, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల్లో అనేక మంది ఎస్టీ నిరుద్యోగులకు అన్యాయం జరిగే క్రమంలో సంబంధిత అధికారులతో మాట్లాడి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పటిష్టంగా అమలు చేయడం జరిగింది.

04

ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులతో మాట్లాడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ సమీపములోని యానాది కుటుంబాలకు చెందిన భూముల్లో దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న బోర్డు వేయు కార్యక్రమాన్ని చేపట్టడమైనది.

05

ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్స్ ఇప్పించుటకు అనేక మందికి సహకరించడమైనది.

06

ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న సర్వీస్ మేటర్స్ విషయంలో అనేక మందికి న్యాయం చేయడమైనది.

07

ఆదివాసీ పేద ప్రజానీకానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆధిపత్య వర్గాలతో ఘర్షణ వాతావరణాల్లో పేదల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయడమైనది.

08

ప్రభుత్వ టీచర్స్ సర్వీసులో ఉండి పై చదువులు చదువుకోటానికి అవకాశం కల్పించే జి.ఓ.ను రద్దు చేసే క్రమంలో ఉన్నత అధికారులతో మాట్లాడి ఆ 342 జి.ఓ.ను పునరుద్ధరించడమైనది.

09

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, డిప్యూటేషన్ల నిర్వహణా క్రమంలో ఎస్టీలవైపు నిలబడి అనేక మందికి న్యాయం చేయడమైనది.

10

విద్యార్థులకు, నిరుద్యోగులకు నూతన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించడమైనది.

11

బహుజన భావజాలం కలిగిన క్యాలెండర్స్‌ను ముద్రించి ఆదివాసీ కుటుంబాలకు పంచే కార్యక్రమం కొనసాగుతుంది.

12

రిజర్వేషన్స్ జి.ఓ.లతో పాటు సర్వీసు మేటర్‌కి సంబంధించిన వివిధ రకాల జి.ఓ.లను డైరీలో పొందుపరచి ఆదివాసీ ఉద్యోగులకు పంపిణీ చేయడం జరుగుతుంది.

13

ఆదివాసీల్లోని ప్రతి ఉద్యోగిని లీడర్లుగా తయారు చేసే కార్యక్రమం కొనసాగుతుంది.

14

ఆదివాసీలలో 50 శాతం లోపు ఉన్న అక్షరాస్యతను 100 శాతం సాధించుటకు సంపూర్ణ ఆదివాసీ అక్షర ఉద్యమాన్ని ప్రారంభించడమైనది.

15

పేద ఆదివాసీ ఆవాసాల్లోకి ఆదివాసీ అధికారులను, ఉద్యోగులను తీసుకువెళ్ళి చైతన్య యాత్రను నిర్వహించే కార్యక్రమం కొనసాగుతుంది.

16

నిరుద్యోగ యువతీయువకులకు ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కొరకు జూమ్/ఆన్‌లైన్ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్ సంఘంచే నిర్వహించబడుతూ ఉన్నది.

17

అనేక మంది అతి నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు సంఘంచే వివిధ రకాల సహకారం అందించడమైనది.

18

కరోనా మొదటి దశ, రెండవ దశల్లో ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అనేకమందికి అండగా నిలబడి సకాలంలో వైద్య సేవలు అందించడమైనది.

19

వివిధ కారణాలచే నిరాశ్రయులైన ఆదివాసీ కుటుంబాలకు వివిధ రకాలుగా సహకారం అందించడమైనది.

20

ఉద్యోగులు మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా సంఘం వివిధ రకాలుగా కృషి చేస్తోంది.

21

తెలంగాణా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మరకాల ప్రసన్న కుమారి గారిచే ఆ రాష్ట్రంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

కొనసాగుతున్న కార్యక్రమాలు

సంఘ కార్యాచరణ

అక్షరాస్యత

సంపూర్ణ ఆదివాసీ అక్షర ఉద్యమం

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమై దేశమంతటా విస్తరిస్తోంది. లక్ష్యం — పదేళ్ళలో 18 ఏళ్ళలోపు ప్రతి ఆదివాసీ బిడ్డ చదువులో ఉండాలి, 100 శాతం అక్షరాస్యత సాధించాలి.

ఉచిత కోచింగ్

గ్రూప్-4 నుంచి సివిల్స్ వరకు ప్రతిరోజు ఆన్‌లైన్ తరగతులు

అన్ని కేటగిరీల నిరుద్యోగ యువతీ–యువకులకు జూమ్ ద్వారా ప్రతిరోజు ఉచిత తరగతులు. ఫీజు లేదు, ప్రవేశ పరీక్ష లేదు — బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీయే లక్ష్యం.

క్షేత్రస్థాయి

ఆదివాసీ ఆవాసాల చైతన్య యాత్ర

అధికారులు, ఉద్యోగులు అత్యంత పేద ఆవాసాల్లోకి వెళతారు. ప్రతి సమావేశం ప్రారంభానికి ముందు ఆ కాలనీలో ఇంటింటి పలకరింపు యాత్ర నిర్వహిస్తారు.

సర్వీస్ మేటర్స్

ప్రమోషన్లు, బదిలీలు, బ్యాక్‌లాగ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్

పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, డిప్యూటేషన్లు, బదిలీలు, బ్యాక్‌లాగ్ ఖాళీలను సంబంధిత శాఖలతో సంఘం చేపడుతుంది. సంబంధిత జి.ఓ.లను వార్షిక డైరీలో ప్రచురిస్తుంది.

బహుజన, లౌకికవాద నాయకులచే జూమ్ ద్వారా నిర్వహించబడిన 43 శిక్షణా తరగతులు

#వక్తఅంశం
1Sirra Karuna Raju, IASబహుజన సమాజ నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర
2Mallepalli Lakshmaiah (Writer)ఆదివాసీ హక్కులు — అంబేద్కర్ కృషి
3Theegala Venkataiahఅంబేద్కర్ పట్ల ఆదివాసీల వైఖరి
4Marakala Prasanna Kumariమహిళా సాధికారతకు అంబేద్కర్ కృషి
5Dr. Kadire Krishnaబహుజన రంగంలో ఎస్టీలు
6Dr. Kathi Padma Raoఅంబేద్కర్‌కు పుస్తకాలతో ఉన్న అనుబంధం
7Dr. Prakash Ambedkar (Grandson of Ambedkar)నిజమైన అంబేద్కరిజం
8Prof. Dr. Devarakonda Ramesh (AU)బహుజన పితామహుల – మాతామహుల విద్య
9PSN Murthy, Retd. IASరిజర్వేషన్ల స్థితి — లబ్ధిదారుని దృక్కోణం
10Bamcef Chiranjeeviఆదివాసీలు ఎవరు? ఆధునిక భారత నిర్మాణంలో వారి పాత్ర
11Prof. Dr. Gali Vinod Kumar (OU)మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అక్రమాలు, అన్యాయాలు — ఒక సమీక్ష
12Dr. K.S. Bhagya Rao, IRS-VRSమీడియాపై అంబేద్కర్ ఆలోచనలు
13Prof. Dr. PD Satyapal (AU)ఎస్టీల మూలాలు — వాస్తవ చరిత్ర, నేటి పరిస్థితి
14Dr. Pratyusha Subbarao (Psychologist)గౌతమ బుద్ధ, మహాత్మా ఫూలే, బాబా సాహెబ్ అంబేద్కర్‌ల వ్యక్తిత్వం
15Dr. S. Rajya Lakshmi (Women's Commission Member)మహిళల చట్టాలు, హక్కులు, సాధికారత
16Dr. Chukka Nagabhushanam (Lecturer)బాబా సాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని ఎస్టీలు ఎందుకు తెలుసుకోవాలి?
17Shankara Suraఆధునిక భారత నిర్మాణంలో మొదటివాడు — ఫూలే
18Prof. Dr. Katta Subbaraoనేడు ఎంత సాంకేతికత అందుబాటులో ఉంది? దానిలో మనం ఎంత వాడుతున్నాం?
19Bethala Sudarshanamబహుజనుల ఉమ్మడి లక్ష్యాలు ఏమిటి?
20Palaparthi Balajiవిశ్వ స్ఫూర్తి గౌతమ బుద్ధుని వాస్తవ ఘట్టాలు

43 తరగతుల్లో 1–20 వక్తలు ఇక్కడ ఇవ్వబడ్డారు. పూర్తి జాబితా సంఘ వార్షిక డైరీలో ఉంటుంది.

బహుజన క్యాలెండర్

సంఘం నిర్వహించే కార్యక్రమాల తేదీలు

సంఘ డైరీలోని 83 ప్రత్యేక దినాల నుంచి ఎంపిక చేసినవి. నెలను ఎంచుకోండి.

02

1518 సంత్ కబీర్ వర్ధంతి

03

సావిత్రిబాయి ఫూలే జయంతి / మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

12

1953 ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్‌కు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ప్రదానం

26

రిపబ్లిక్ డే

27

1919 సౌత్‌బారో కమిటీకి అంబేద్కర్ నివేదిక

03

1928 సైమన్ కమిషన్‌తో అంబేద్కర్ సమావేశం

04

1933 ఎర్రవాడ జైలులో గాంధీతో అంబేద్కర్ సమావేశం

05

1951 పార్లమెంట్‌లో హిందూ కోడ్ బిల్ ప్రవేశం

07

1897 రమాబాయి అంబేద్కర్ జయంతి

21

1948 భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతి తయారు

23

1876 సంత్ గాడ్గే బాబా జయంతి

28

జాతీయ సైన్స్ దినోత్సవం

03

1930 కాలారాం ఆలయ ప్రవేశ పోరాట ఉద్యమం మొదలు

08

ప్రపంచ మహిళా దినోత్సవం

10

1897 సావిత్రిబాయి ఫూలే వర్ధంతి

15

1934 బహుజన నాయక్ కాన్షీరాం జయంతి

18

1956 షెడ్యూల్ కులాలను ఉద్దేశించి అంబేద్కర్ చారిత్రక ప్రసంగం

20

1927 మహద్ చెరువు నీళ్ల కొరకు అంబేద్కర్ నడిపిన మొదటి మానవ హక్కుల పోరాటం

24

2015 పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు వీరమరణం

03

1927 అంబేద్కర్ బహిష్కృత భారత్ పత్రిక ప్రారంభం

04

1906 రమాబాయితో అంబేద్కర్ వివాహం

05

1908 బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి

07

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

11

1827 మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి

12

1992 పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అంబేద్కర్ చిత్రపటం ఆవిష్కరణ

14

1891 అంబేద్కర్ జయంతి

01

ప్రపంచ కార్మిక దినోత్సవం

06

1924 అల్లూరి సీతారామరాజు వర్ధంతి

08

1889 ఫూలేకు ‘మహాత్మ’ బిరుదు ప్రదానం

09

1916 అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీకి కులాలపై పరిశోధనా గ్రంథం సమర్పణ

11

1946 భారత తాత్కాలిక ప్రభుత్వ స్థాపన, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు

26

1935 రమాబాయి అంబేద్కర్ వర్ధంతి

30

1920 సాహూ మహారాజ్, అంబేద్కర్‌ల మద్యపాన నిషేధంపై పిలుపు

04

1897 వెన్నెలకంటి రాఘవయ్య జయంతి / 1858 ఝల్కారీబాయి బలిదానం

05

1952 అంబేద్కర్‌కు కొలంబియా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లా ప్రదానం

09

1900 జననాయక్ బిర్సా ముండా వర్ధంతి

20

1946 అంబేద్కర్ సిద్ధార్థ కళాశాల స్థాపన

26

1874 సాహూ మహారాజ్ జయంతి

29

1456 సంత్ కబీర్ జయంతి

03

1851 ఫూలే దంపతులచే శూద్రులకు పాఠశాల

04

1897 అల్లూరి సీతారామరాజు జయంతి

06

జగ్జీవన్‌రామ్ వర్ధంతి

21

1942 బోధించు, పోరాడు, సమీకరించు అని అంబేద్కర్ పిలుపు

22

1947 అశోకచక్రం ఉండాలని తీర్మానం

24

1971 గుర్రం జాషువా వర్ధంతి

09

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

15

స్వాతంత్ర్య దినోత్సవం

26

1854 నారాయణగురు జయంతి / 1910 మదర్ థెరిస్సా జయంతి

29

1947 భారత ప్రథమ న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షునిగా అంబేద్కర్ ఎన్నిక

31

1952 పి.టి. యాక్ట్ రద్దయిన రోజు

03

1974 మల్లి మస్తాన్ బాబు జయంతి

05

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం / 1997 మదర్ థెరిస్సా వర్ధంతి

08

ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం

16

1851 ఫూలే దంపతులచే బాలికల కోసం పాఠశాల ఏర్పాటు

17

1878 పెరియార్ రామస్వామి జయంతి

22

1928 నారాయణగురు వర్ధంతి

23

అంబేద్కర్ ఆంధ్రా పర్యటన / పూనా ఒడంబడిక — బ్లాక్ డే

27

1951 అంబేద్కర్ మంత్రి పదవికి రాజీనామా

28

1895 గుర్రం జాషువా జయంతి

07

2010 ఎస్.ఆర్. శంకరన్ వర్ధంతి

08

1940 కొమరం భీమ్ వర్ధంతి

09

2006 కాన్షీరాం వర్ధంతి

12

దుర్మార్గమైన 1871 పి.టి. యాక్ట్ అమలైన రోజు

14

1956 అంబేద్కర్ బౌద్ధధర్మ స్వీకారం

17

1930 లండన్‌లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం

21

1901 కొమరం భీమ్ జయంతి / 1934 ఎస్.ఆర్. శంకరన్ జయంతి

25

1964 కళేకూరి ప్రసాద్ జయంతి

28

బుద్ధుడు, కబీర్, ఫూలే తన ఆదర్శం అని అంబేద్కర్ ప్రకటన

15

1875 బిర్సా ముండా జయంతి

24

1981 వెన్నెలకంటి రాఘవయ్య వర్ధంతి

26

1949 భారత రాజ్యాంగ దినం

28

1890 మహాత్మా ఫూలే వర్ధంతి

29

1948 ఆర్టికల్ 17 అస్పృశ్యత నిర్మూలన నిబంధన ఆమోదం

06

1978 కాన్షీరాం బామ్‌సెఫ్ స్థాపన / 1956 అంబేద్కర్ వర్ధంతి

07

1956 అంబేద్కర్ అంతిమయాత్ర

10

ప్రపంచ మానవ హక్కుల దినం

15

1922 సాహూ మహారాజ్ వర్ధంతి

20

1956 సంత్ గాడ్గే బాబా మహారాజ్ వర్ధంతి

24

1973 పెరియార్ రామస్వామి వర్ధంతి

25

1927 మనుస్మృతి దహన దినం

నేను… నా సంఘం… నా ప్రతిజ్ఞా ప్రమాణం

సంఘం ఆశయాలకు – లక్ష్యాలకు అనుగుణంగా చిత్త శుద్ధితో – అంకిత భావంతో, నీతిగా – నిజాయితీగా, ధర్మంగా సమ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తానని… ఈ నా సంఘానికి వందేళ్ళకు పైబడిన కీర్తి – ప్రతిష్ఠలను మరియు సువర్ణ చరిత్రను సృష్టించడం కోసం మాటలతో పాటు చేతల్లో కూడా నా సమర్థతను నిరూపించుకుంటానని ప్రతిజ్ఞా ప్రమాణం చేస్తున్నాను.

జై ఆదివాసీ · జై బహుజన్ · జై సెక్యులరిజం · జై భీమ్ · జై భారత్

నాయకత్వం

సంఘ పదాధికారులు

జాతీయ, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ, మండల కమిటీలతో పాటు విదేశాల్లో NRI కమిటీ.

MP

శ్రీమతి మరకాల ప్రసన్న కుమారి

రాష్ట్ర అధ్యక్షురాలు, తెలంగాణ
+

కమిటీ సభ్యులు

రాష్ట్ర, జిల్లా, మండల పదాధికారుల జాబితా త్వరలో

సభ్యత్వం

సంఘంలో చేరండి

భారతదేశంలోని ప్రస్తుత, పదవీ విరమణ చేసిన ఎస్టీ అధికారులు, ఉద్యోగులు సభ్యత్వం పొందవచ్చు. మీ వివరాలు నింపండి — మీ రాష్ట్ర కమిటీ మిమ్మల్ని సంప్రదిస్తుంది.

కనీసం నెలలో నాలుగు గంటలు, మీ జాతి ప్రజలతో.

సంప్రదించండి

సంఘాన్ని సంప్రదించండి

ప్రధాన కార్యాలయం

అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం (AISTEA)
రిజి. నం. 965 / 2019
[కార్యాలయ చిరునామా — చేర్చవలసి ఉంది]

ఫోన్, ఇ-మెయిల్

+91 00000 00000

info@aistea.org

ఉచిత కోచింగ్ వివరాలు

ప్రతిరోజు జూమ్ తరగతులు — గ్రూప్-4 నుంచి సివిల్స్ వరకు. లింక్ కోసం మమ్మల్ని సంప్రదించండి.